
ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డును సందర్శించిన జగన్ మోహన్ రెడ్డి పొగాకు రైతులతో మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతులు పడుతున్న అవస్థలను ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు,రైతు పరిస్థితి ఎలా ఉండేది? అది ఏ విధంగా దిగజారింది అని చెప్పడానికి నిదర్శనం జిల్లాలో జరిగిన రైతుల ఆత్మహత్యలు. ఇకనైనా రైతుల సమస్యలపై స్పందించకపోతే కచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం