
గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న సంగతి తెలిసిందే. శుక్లా భూమిపై నుంచి చాలా విచిత్రమైన సూక్ష్మజీవిని కూడా తీసుకువెళ్లనున్నారు. అదే టార్డిగ్రేడ్స్. టార్డిగ్రేడ్స్ను నీటి ఎలుగుబంట్లు లేదా నాచు పందిపిల్లలు అని కూడా పిలుస్తారు… ఈ సూక్ష్మ జీవులు అంతరిక్షంలోని కఠినమైన వాతావరణంలో ఎలా మనుగడ సాగిస్తాయో, ఎలా పునరుత్పత్తి చేస్తాయో?, వాటిని అవి ఎలా బాగు చేసుకుంటాయో అన్వేషించనున్నారు.