
గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా సచివాలయ ఉద్యోగులు ఎన్నోరోజులుగా ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించనుంది. కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. సంబంధిత అధికారులతో చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. రెండు రోజులలోనే ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉంది.