
తెలంగాణలో గ్రూప్ 3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌ను వాయిదా వేస్తూ TGPSC కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రూప్ 3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయాలని TGPSC నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వలను జారీ చేసింది. పోస్టుల బ్యాక్ లాగ్ ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కొత్త షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.