
కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో సోనియా గాంధీకి చికిత్స కొనసాగుతుంది. అయితే, సోనియా గాంధీని సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేర్పించినట్లు అధికారులు తెలిపారు.