
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం, పెద్ద ధన్వాడ గ్రామ సమీపంలో 35 ఎకరాల్లో గాయత్రి ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన కేసులో 57 మంది రైతులపై కేసులు నమోదు చేశారు. అందులో 12 మంది రైతులను గురువారం రిమాండ్‌కు తరలించగా 40 మంది రైతులు పరారీలో ఉన్నారని, 5 మందికి నోటీసులు ఇవ్వడం జరిగిందని పోలీసులు తెలిపారు.