
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భయపడినట్లుగానే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. జూన్ 12న రావాల్సిన ఈ చిత్రం వెనక్కి వెళ్తున్నట్లు టాలీవుడ్ కోడై కూస్తోంది.ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ రద్దుతో పాటు టికెట్ డబ్బులు తిరిగి ఇస్తున్నారన్న వార్తలతో రిలీజ్ వాయిదా ఖాయమని ప్రచారం జరుగుతోంది. రిలీస్ పోస్ట్‌పోన్ అవుతున్నట్లు ఇంత ప్రచారం జరుగుతున్నా నిర్మాత కనీసం స్పందించకపోవడాన్ని చూస్తుంటే వాయిదా కన్ఫామ్ అని తెలుస్తోంది.