
ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు ఇంజక్షన్ వికటించి చనిపోయారు. వ్యవసాయ కూలీల కుటుంబాలకు చెందినవారు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆరుగురు రోగులకు ఒకే బ్యాచ్‌కి చెందిన ఇంజక్షన్లు ఇవ్వగా వాటిని వేసిన కొద్ది నిమిషాల్లోనే రోగులు ఊపిరి ఆడక విలవిలలాడిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమవారు మృతిచెందారని బంధువులు ఆందోళనకు దిగారు.