
ఆర్సీబి విజయోత్సవ పరేడ్ తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థించారు. హృదయ విదారకమంటూ బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చోప్పున నష్ట పరిహారం ప్రకటించింది.