
ఆగ్రోటెర్రరిజం.. ఒక దేశపు వ్యవసాయాన్ని చంపేయ్యడం. శత్రుదేశంలో ఆహార కొరతను సృష్టించి.. తద్వారా సామాజిక అశాంతిని పెంచడం.. ఇదీ లక్ష్యం. ఇందుకోసం వ్యవసాయ రంగంలోకి తెగుళ్ళు, వ్యాధులు, వ్యాధికారకాల్ని ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెడతారు. అమెరికాలో ఇద్దరు చైనీయులు అరెస్టయ్యారు. ప్రమాదకరమైన ఫంగస్‌ను స్మగ్లింగ్ చేస్తున్నారన్నది అభియోగం. డేంజరస్ బయొలాజికల్ స్మగ్లింగ్ చేసి.. అగ్రో టెర్రరిజానికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.