
రాయల్ ఛాలెంజ్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవ వేడుక 10 మంది ప్రాణాలను బలిగొంది. 18 సంవత్సరాల నిరీక్షణ తరువాత ఈ ఐపిఎల్లో ఈ జట్టుకు తొలిసారి ఈ విజయం దక్కింది. దీనితో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్థాయిలో విజయోత్సవ సభ ఏర్పాటు చేసింది. కన్నడ భాషాభిమానం పొంగిపొర్లే కర్నాటకలో ఈ సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. అయితే సరైన ఏర్పాట్లు లేకపోవడం, జనం అత్యుత్సాహంతో పరిస్థితి అదుపు తప్పి, తొక్కిసలాటకు దారితీసిందని వెల్లడైంది.