ఏపీలో సంచలనం సృష్టించిన తుని కేసును రీ ఓపెన్ చేయనున్నట్లు సోమవారం అధికార వర్గాలు తెలిపాయి.. కేసు తెరపైకొచ్చిన 24 గంటల్లోనే రీఓపెన్ ఆలోచనను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేసును రీ-ఓపెన్ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. రైల్వేకోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లే యోచనను విరమించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన అంశాల్లో అలసత్వం వద్దన్న ప్రభుత్వం… కేసును తిరగదోడే ఉద్దేశం లేదంటూ ప్రకటించింది.

