
దాదాపు రెండేళ్ల తరువాత దేశంలో ఇప్పుడు కరోనా మరోసారి భయం రేపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల 3 వేల వరకు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. కేరళలో 1147 కరోనా కేసులు, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా 7 మంది మరణించారు. మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చనిపోయారు.