
కఠినమైన నియమాలు పాటించే సౌదీ అరేబియా లో కూడా కాలానికి తగ్గట్లుగా మారే ప్రయత్నాలు చేస్తోంది. ఏడు దశాబ్దాలుగా ఆ దేశంలో మద్యానికి అనుమతి లేదు. 2026 నాటికి, సౌదీ అరేబియా తమ 73 ఏళ్ల మద్య నిషేధాన్ని సడలించాలని యోచిస్తోంది, దేశవ్యాప్తంగా సుమారు 600 లగ్జరీ హోటళ్లు, రిసార్ట్లు, పర్యాటక స్థలాలలో మద్యం అమ్మకాలను అనుమతించనున్నారు. సౌదీలో త్వరలో అనుమతి ఇవ్వనున్న మద్యం అమ్మకాలు కేవలం 20 శాతం కంటే తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న పానీయాలకు మాత్రమే పరిమితం చేస్తారు.