
“మహానాడు ముచ్చటలో వైఎస్ఆర్ పేరే పలకాల్సి వస్తుందని ఒక్కరోజు ముందు ఏకంగా జిల్లా పేరునే మార్చేశారు. వ్యక్తిగతంగా ఇది బాధించే అంశమే అయినా.. కడప జిల్లా చరిత్రను, సంప్రదాయాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. మహానేత మరణానంతరం కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ.” అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.