
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద..సూపర్‌బెట్ క్లాసిక్ టోర్నీలో విజేతగా నిలిచాడు. గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరిగిన టోర్నీలో ప్రజ్ఞానంద తొలిసారి టైటిల్ దక్కించుకున్నాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన టోర్నీలో ఈ చెన్నై చిన్నోడు టైబ్రేక్ ద్వారా టైటిల్‌ను ఒడిసిపట్టుకున్నాడు. విజేతను నిర్ణయించేందుకు జరిగిన టైబ్రేక్‌లో ప్రజ్ఞానంద..ఫిరౌజాతో గేమ్‌ను డ్రా చేసుకోగా, వాచిర్ లాగ్రేవ్‌తో ఫిరౌజా డ్రా చేసుకున్నాడు. ఆఖరి గేమ్‌లో వాచిర్ను ఓడించడం ద్వారా ప్రజ్ఞానంద విజేతగా నిలిచి 66 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నాడు.