
నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇటీవల సమంత శుభం చిత్రంతో నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అడుగు వేసింది. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ ఇప్పుడు బహిరంగ రహస్యం. నాకు అవకాశం ఇచ్చిన సమంతకి శుభం. రాజ్ తో సమంత కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. మీరిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి.. శతమానం భవతి అని మధుమణి దీవించారు. మధుమణి కామెంట్స్ కి సమంత చప్పట్లతో రియాక్షన్ ఇచ్చింది.