
ముంబై విమానాశ్రయంలో సుమారు 70% గ్రౌండ్ ఆపరేషన్లను నిర్వహిస్తున్న టర్కీ కంపెనీ సంస్థ సెలెబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌కు, భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భద్రతా అనుమతులను రద్దు చేసింది. ఈ చర్య, జాతీయ భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని తీసుకున్నట్లు మంత్రి మురళీధర్ మొహొల్ తెలిపారు. సంస్థలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కుమార్తె సుమేయే ఎర్డోగాన్‌కు పాక్షిక వాటాలు ఉన్నట్లు సమాచారం. ఆమె భర్త సెల్కుక్ బైరక్టార్, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉపయోగించిన బైరక్టార్ డ్రోన్లను తయారు చేసే వ్యక్తి కావడం గమనార్హం.