
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఏ2గా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేయడంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో ఉన్నారు. తనకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాల్సిందిగా గాలి జనార్దన్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దోషులుగా తేలిన వ్యక్తులు ఎటువంటి ప్రత్యేక కేటగిరీ ఉపశమనం పొందేందుకు అర్హులు కారని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్ను తోసిపుచ్చింది.