
భారతదేశంలో ఆపిల్ ఉత్పత్తుల విస్తరణ వద్దని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్ట్ ను బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తొలగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వ్యక్తిగతం గా ఫోన్ చేయడంతో తాను పోస్ట్ ను తొలగించినట్లు కంగనా తెలిపారు. ఆపిల్ సంస్థ భారతదేశంలో విస్తరించడం పట్ల ట్రంప్ ఎందుకు కంగారు పడుతున్నారంటూ రనౌత్ ఆ పోస్ట్ లో వ్యాఖ్యానించారు.