
తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఆన్లైన్లో జరుపుకునేందుకు వీలుగా 2020 అక్టోబర్‌లో ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ధరణి పోర్టల్ నిర్వహణ విదేశీ సంస్థలకు అప్పగించడంతో కొందరు ప్రైవేటు వ్యక్తులు రాష్ట్రంలోని భూ రికార్డులను తారుమారు చేసి తమ పేర్లపైకి మార్చుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ధరణిలో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చేందుకు ధరణిపై ఫొరెన్సిక్ అడిట్కు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. కేరళ రాష్ట్రానికి చెందిన ఓ ప్రభుత్వ ఏజెన్సీకే ఆడిట్ బాధ్యతలను అప్పగించనుంది.రెండ్రోజుల్లో వీటిపై ఉత్తర్వులు వెలువడనున్నాయి.