
తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా జలాలపై కీలక చర్చ జరగింది. తెలంగాణలోనే 70 శాతం నది ఉన్నందున కచ్చితంగా 70 శాతం నీళ్లు సాధించాలని అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతానికి నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. రాబోయే రెండేండ్లలో అంటే 2027 జూన్ నాటికి కృష్ణాపై అసంపూర్తిగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని తెలిపారు.