
‘ఆపరేషన్ సింధూర్’లో భాగంగా పాకిస్తాన్ పై దాడి చేసినప్పుడు టర్కీ పాకిస్తాన్ కు మద్దతుగా తమ డ్రోన్లను పంపించడంతోపాటు సైనిక పరంగా కూడా సహాయం చేసింది. ఈ నేపథ్యంలో భారత ఏజేన్సీలు కూడా ఇప్పటికే ట్రావెల్ కూడా రద్దు చేశాయి. ‘బైకాట్ టర్కీ’ ట్రెండింగ్ లో ఉంది జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం తుర్కియేతో ఉన్న ఇనోను విశ్వవిద్యాలయం సహకారాన్ని నిలిపివేసింది. జాతీయ భద్రత సమస్యల కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు JNU ప్రకటించింది.