
ఆంధ్రప్రదేశ్‌లో వేసవిలో వాతావరణం తారుమారవుతోంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుండగా, మరికొన్ని జిల్లాల్లో వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయానికే సూర్యుడు ఉగ్రరూపం దాల్చడంతో జనం ఇంట్లోనే ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలం కాకానిలో 43.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ వేసవిలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఒకటి గురువారం రాష్ట్రంలో పలుచోట్ల మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా.
- 0 Comments
- Palnadu District