
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్చేంజీలో కుద బెట్టి, రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని లక్ష 75 వేల ఎకరాల టిజిఐఐసి భూములను స్టాక్ ఎక్స్చేంజీలో తాకట్టు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఎంఎల్సి కవిత విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ అయిన టిజిఐఐసిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ ప్రభుత్వం రహస్య జిఒ విడుదల చేసిందన్నారు.