
ఏపీలోని కర్నూలు దగ్గర దూపాడు దగ్గర రింగురోడ్డు వద్ద బెంగళూరు-హైదరాబాద్ నేషనల్ హైవే-44పై భూమి కుంగిపోయింది. ఆరు మీటర్ల వెడల్పు, పదహారు మీటర్ల లోతులో పెద్ద గొయ్యి ఏర్పడింది. హైవే పక్కన రోడ్డు కుంగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు వెంటనే ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. హైవేలో గుంత ఏర్పడటంతో.. కొన్ని వాహనాలను మరో దారిలో పంపించారు. అయినా చాలా వాహనాలు రాత్రి ఎనిమిది గంటల వరకు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.