
ఎలివేటేడ్ కారిడార్ భూసేకరణపై గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ రింగ్‌రోడ్డు వరకు 18 కిలోమీటర్ల మేర నిర్వహించనున్న కారిడార్ నిర్మాణానికి భూ సేకరణ పక్రియకు ఓ వైపు రక్షణ శాఖ కొర్రీలు, మరోవైపు స్థానికుల వ్యతిరేకతతో బ్రెక్ పడిన విషయం విదితమే. భూ సేకరణ పక్రియపై ఇదివరకు ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలను గ్రామస్తులు బహిష్కరించి న్యాయస్థానాలను ఆశ్రయించారు. తిరిగి ఈనెల 9న గ్రామాలకు సంబంధించిన గ్రామసభను లోతుకుంటలో రెవెన్యూ అధికారులు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేశారు.
- 0 Comments
- Hyderabad