
నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు, తీరప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తీరప్రాంతాలైన జామ్నగర్, హాలార్ బీచ్ తదితర ప్రాంతాల్లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), మెరైన్ పోలీస్, టాస్క్ ఫోర్స్ కమాండోలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హాలార్ బీచ్లో నిఘా కట్టుదిట్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుజరాత్ వ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించారు