
పాకిస్తాన్, భారత్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలతో బుధవారం ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలోని విమానాశ్రయాలు మూసివేయనున్నారు. ధర్మశాలతో పాటు లేహ్, జమ్మూ, శ్రీనగర్, అమృత్‌సర్‌తో సహా పలు విమానాశ్రయాలు తదుపరి నోటీసు వచ్చే వరకు మూసివేసి ఉంటాయని స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ ఒక పోస్ట్‌లో తెలిపింది. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాలకు వెళ్లేవారు, అక్కడి నుండి బయలుదేరే విమాన సేవలు అందుబాటులో లేవని విమానాశ్రయానికి చేరుకునే ప్రస్తుత స్థితిని తనిఖీ చేసుకోవాలని విమానయాన సంస్థలు తమ ప్రయాణికులను కోరాయి.