
రాఫెల్ తో పాటు స్కాల్ప్ క్షిపణులు కూడా పాకిస్తాన్‌పై జరిగిప ఆపరేషన్ సింధూర్‌లో కీలకపాత్ర పోషించాయి. స్కాల్ప్ (SALP) అంటే ఒక డీప్ స్ట్రైక్ క్రూజ్ క్షిపణి. ఇది గాలిలో నుంచి భూమిపై దాడులు చేస్తుంది. శత్రు భూభాగంలోకి చొచ్చుకుపోయి మరి లక్ష్యాన్ని ఛేదించగల అద్భుతమైన క్షిపణి అని చెప్పొచ్చు. గగనతలంలో ఉంటూ ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. మొత్తంగా 300 కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణించి శత్రువును నాశనం చేసే సమర్థత కలిగింది.