
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థినుల కోసం కొత్త పథకం తీసుకురాబోతోంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నత విద్య చదివే విద్యార్థినుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం పేరు ‘కలలకు రెక్కలు’గా నిర్ణయించారు.
అలాగే గత ప్రభుత్వం నిలిపివేసిన అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీట్లు పెంచాలని లెక్చరర్ల కొరతను తీర్చాలని సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను విద్యార్థులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేస్తామని చెప్పారు.