
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో వింత చేష్టకు దిగారు. ట్రంపోప్ అనే శీర్షికతో ఓ ఫోటోను సామాజిక మాధ్యమంలో ప్రవేశపెట్టారు. పోప్ వేషధారణతో ఉన్న తన ఫోటోను కృత్రిమ మేధ (ఎఐ) ద్వారా రూపొందేలా చేసి తనకు తానే మరో పోప్ అని ప్రకటించుకుంటూ చిల్లర చమత్కారానికి దిగారు. ట్రంప్ పోప్ అవతారం ఫోటోను అధికారికంగానే వైట్‌హౌస్ తమ సామాజిక మాధ్యమం ద్వారానే వెలువరించింది.