
ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES 2025)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ పాల్గొన్నారు. “నెక్ట్స్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ విప్లవం భారత్‌లో వచ్చేలా చేద్దాం” అనే థీమ్‌తో కీలక ప్రసంగం చేశారు. ఇది భారతదేశ సాంస్కృతిక, క్రియేటివిటీ, టెక్నాలజీ శక్తిని ప్రదర్శించే అంతర్జాతీయ వేదికగా రూపొందింది. భారతదేశం గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో నాయకత్వం వహించగలదని, “ఇది సాఫ్ట్ పవర్ కాదు, రియల్ పవర్” ముకేష్ అంబానీ అన్నారు.