
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో చోటుచేసుకున్న దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. మీడియాతో మాట్లాడిన వైయస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “తెలిసి కూడా ఎందుకంత నిర్లక్ష్యం?” అని ప్రశ్నించారు. చందనోత్సవం, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు వస్తారని ప్రభుత్వానికి తెలియదా? అని నిలదీశారు. భక్తుల భద్రతకు సరైన ఏర్పాట్లు చేయకుండా, నిర్లక్ష్యంతో ప్రాణాలను బలిగొన్నారని మండిపడ్డారు.
.