
విద్యార్థి వీసాపై యూఎస్‌కు వచ్చిన 24 ఏళ్ల మహమ్మదిల్హామ్ వహోరా, హజియాలి వహోరా అనే ఇద్దరు భారతీయ యువకులను వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతూ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని అరెస్టు చేశారు.
చికాగోలోని ఈస్ట్-వెస్ట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఈ విద్యార్థులు.. వృద్ధులకు ఫోన్లు చేసి తాము ప్రభుత్వ ఏజెంట్లమని నమ్మబలికి.. వివిధ కేసుల పేరుతో డబ్బులు డిమాండ్ చేసేవారు. భయభ్రాంతులకు గురిచేసి వారి నుండి క్రిప్టోకరెన్సీ ఏటీఎంల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయించి.. ఆపై దానిని నేరుగా తీసుకునేవారు.