
శ్రీ కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ సన్యాస దీక్ష స్వీకరించారు. కుటుంబసభ్యుల సమక్షంలో తమిళనాడులోని కంచి పీఠంలో ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి సన్యాస దీక్ష ప్రసాదించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ 1998లో జన్మించారు. అన్నవరంలో సంప్రదాయ వేద శిక్షణతో కర్నాటకకు చెందిన చందుకట్టు హోసమనే రత్నాకర భట్ శర్మ ఆధ్వర్యంలో వేద విద్యను అభ్యసించారు.