
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో భారత ప్రభుత్వం ఉంది. కచ్చితంగా దాడి ఉంటుందని ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను పాకిస్థాన్ ఆర్మీ ఖాళీ చేయిస్తోంది. అక్కడ ఉన్న ఉగ్రవాదులను బంకర్లు, ఆర్మీ షెల్టర్లలోకి హుటాహుటిన తరలిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. పీఓకేలోని ఉగ్రవాదులను ఎలాగైనా కాపాడుకునేందుకు పాకిస్థాన్ ఆర్మీ ఇలా చేస్తున్నట్లు సమాచారం.