
తాను సిఎం అయిన రెండో రోజే కెసిఆర్ గుండె పగిలిపోయిందని ఆయన ఆరోపించారు. ఇప్పడు రాష్ట్రంలో జరుగుతున్న అనర్ధాలకు కెసిఆర్ బాధ్యత వహించాలని, రాష్ట్ర ఖజానాను లూటీ చేసింది కెసిఆర్ అని ఆయన మండిపడ్డారు. కెసిఆర్ స్పీచ్ అంతా అక్కసుతో నిండి ఉందని ఆయన విమర్శించారు. కెసిఆర్ అభద్రతా భావంలో కాంగ్రెస్‌పై అక్కసు వెళ్లగక్కారని సిఎం రేవంత్ ఫైర్ అయ్యారు. ఆయన స్పీచ్‌లో క్లారిటీ లేదన్నారు.