
విజయ్ దేవర కొండ తన రౌడీ బ్రాండ్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించాడు. ఈ సందర్భంగా మరోసారి రౌడీ వేర్స్‌ను అల్లు అర్జున్ కు పంపించాడు విజయ్. ఈ విషయాన్ని ఐకాన్ స్టార్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. విజయ్ తనకు పంపిన గిఫ్ట్స్ ఫొటోలను ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసిన బన్నీ.. ‘మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడూ నువ్వు సర్‌ప్రైజ్ చేస్తుంటావు. సో స్వీట్’ అని విజయ్ పై ప్రేమను కురిపించాడు బన్నీ. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.