
హైదరాబాద్ ప్రజల జీవనశైలిలో ఓ భాగమైన హైదరాబాద్ మెట్రో రైల్ (HMRL) ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నప్పటికీ, ఆర్థికంగా మాత్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎల్ అండ్ టీ సంస్థ సారథ్యంలో నడుస్తున్న ఈ ప్రజా రవాణా వ్యవస్థ ప్రారంభం నుంచే నష్టాల బాటలో పయనిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం మధ్యంతర కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు ఏకంగా రూ.625 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనూ పరిస్థితి ఏమీ మారలేదు. అప్పుడే మరో రూ.5.55 కోట్ల నష్టం వాటిల్లింది.
- 0 Comments
- Hyderabad