
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన హృదయవిదారక ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘాతుక చర్య వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ బలంగా విశ్వసిస్తున్న వేళ, దాయాది దేశాన్ని వెనకేసుకొచ్చారనే తీవ్ర ఆరోపణలపై అస్సాంకు చెందిన ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఆ దేశ ప్రమేయాన్ని సదరు ఎమ్మెల్యే సమర్థిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. ఇది క్షమించరాని నేరం అని సీఎం మీడియా సమావేశంలో వెల్లడించారు.