
దాడుల విషయంలో భద్రతా బలగాలు నిర్లిప్తత , ఇంటలిజెన్స వర్గాల పర్యవేక్షణా లోపాలు ఉన్నాయనే వాదనల నేపథ్యంలోనే గురువారం అఖిలపక్ష భేటీ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి టెర్రర్ క్యాంప్‌లను ఏరివేయాలని సమావేశంలో పార్టీలకు అతీతంగా నేతలు అంతా పిలుపు నిచ్చారు. నిర్ణయాత్మక చర్యలు తప్పనిసరి, ఉదాసీనత పనికిరాదని వివరించారు. తామంతా ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ చెప్పారు. ప్రతిపక్షాలన్ని కూడా పహల్గామ్ దాడులను ఖండిస్తున్నాయి.