
ప్రముఖ తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. రీసెంట్ గా డ్రగ్స్ కేసు వ్యవహారంలో సైలెంట్ అయిపోయిన ఆయన సినిమాలను కూడా సైలెంట్ గా తెరకెక్కిస్తున్నట్టు భావించారు. లేడి సూపర్ స్టార్ అనుష్కతో ‘ఘాటి’ మొదలుపెట్టాడు క్రిష్. అయితే ఈ మూవీ కూడా మధ్యలో ఆగిపోయిందా? లేకపోతే క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు కూడా ‘మణికర్ణిక’, హరిహర వీరమల్లు మొదలు పెట్టి, మధ్యలో వెళ్ళిపోయాడు.