
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి కి ఏసీబీ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు ఏసిబి స్పెషల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్ రావు మంగళవారం అర్ధరాత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. రిమాండ్ విధించిన అనంతరం నిందితుడు రాజ్ కసిరెడ్డిని పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు.ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని న్యాయమూర్తి ప్రశ్ననిందితుడు కాసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజ శేఖర్ రెడ్డిని సిఐడి కోర్టులో హాజరు పరచడానికి బదులుగా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని న్యాయమూర్తి అడిగారు.