
ఈటీవీలో ప్రసారమవుతున్న సింగింగ్ రియాల్టీ షో ‘పాడుతా తీయగా’ కార్యక్రమం వివాదాలకు వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి ప్రస్తుతం న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్,
గాయని సునీత తనను తీవ్రంగా అవమానించారంటూ ఓ గాయని ప్రవస్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. న్యాయ నిర్ణేతలు తనను మానసికంగా హింసించారని, బాడీషేమింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. కాగా ప్రవస్తి ఆరోపణలను గాయని సునీత ఖండించారు. ఎవరు బాగా పాడినా ప్రోత్సహిస్తాం. పోటీదారులంతా నాకు సమానమే’ అని పేర్కొన్నారు.