టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కొరడా ఝుళిపించారు. సమన్లు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన అడ్వర్టయిజ్మెంట్లో నటించడం ఆయనకు చిక్కులను తెచ్చిపెట్టింది. అడ్వర్టయిజ్మెంట్లో నటించినందుకు మహేష్ బాబుకు ఆ సంస్థ యాజమాన్యం 5.9 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ రెమ్యునరేషన్లో రెండున్నర కోట్ల రూపాయలు మనీలాండరింగ్ ద్వారా కంపెనీ యాజమాన్యం మహేష్ బాబుకు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి.

