
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు వచ్చే అవకాశం ఉంది. 20 ఏళ్ల తరువాత ఏకమయ్యేందుకు ఠాక్రే బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకం కావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అటు రాజ్ ఠాక్రే ,
ఇటు ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. మరాఠీ భాషను కాపాడుకోవడానికి ఎంతవరకైనా తెగిస్తామని ఠాక్రే బ్రదర్స్ ప్రకటించారు. త్రిభాషా సిద్దాంతానికి తాము వ్యతిరేకమని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం ఐదో తరగతి వరకు హిందీని కంపల్సరీ చేయడాన్ని తప్పుపట్టారు. రాజకీయ ప్రయోజనాల కంటే తమకు మహారాష్ట్ర సాంస్కృతిక , భాష వారసత్వమే ముఖ్యమని అంటున్నారు ఇద్దరు నేతలు.