
ఉగ్రవాద కార్యకలా పాలు.. ముంబయి పోలీసులకు ఎప్పుడూ తలనొప్పే! నేరాలు- ఘోరాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. అలాంటి ముంబయిలో లా అండ్ ఆర్డర్‌ను కంటిచూపుతో కంట్రోల్లో ఉంచుతున్నది నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్ అంబిక. పద్నాలుగేండ్లు ఉన్నప్పుడు ఓ పోలీస్ కానిస్టేబుల్‌తో ఆమెకు పెండ్లి చేశారు. సంసారమే ఆ అమ్మాయి ప్రపంచం. పద్దెనిమిదేండ్లకే ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. తన భర్త పై అధికారులకు సెల్యూట్ కొట్టడం చూసి ఆశ్చర్యపోయింది. అలాంటి గౌరవం అందుకోవడం కోసం ఐపీఎస్ కావాలనుకుంది. అనుకున్నట్టే ఐపీఎస్ అయింది.