
ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేథస్సు ( AI) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏఐ ఏడాదిలోనే సాఫ్ట్వేర్ కోడ్‌లన్నింటినీ రాసేస్తుందని ఇప్పటికే పలువురు టెక్నాలజీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనుషులు అందిస్తున్న కొన్ని సేవలను ‘ AI ఏజెంట్లు’గా పిలిచే యంత్రాలే చేయనున్నాయి. ఇక యాప్‌లను ఏఐ ఏజెంట్లు అభివృద్ధి చేయనున్నట్టు తాజాగా ‘గ్లోబల్ సీఆర్ఎం లీడర్ సేల్స్ ఫోర్స్’ తెలిపింది. ఏఐతో ఉద్యోగ నియామకాల్లో సైతం భారీ మార్పులు వస్తాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ టూల్స్‌గా ఏఐ ఏజెంట్లు అవసరమని భావిస్తున్నట్టు రిపోర్టు వెల్లడించింది.