
షవర్మకు పుట్టినిల్లు గల్ప్ దేశాలు. అక్కడ బాగా పాపులర్ వంటకాల్లో ఒకటి. షవర్మని ఎక్కువగా అరేబియన్, ఇటలీ, ఓమన్ దేశాలలో ఇష్టంగా తింటారు. షవర్మకి హైదరాబాద్ నగరంలో సరికొత్త రూపాన్ని తీసుకొచ్చారు. తార్నాకలోని ఎక్సోటిక్ గ్రిల్ అనే ఈటరీ షావర్మా పానీ పూరిని అందిస్తుంది. ఇది మిడిల్ ఈస్టర్న్ మసాలా దినుసులను భారతీయ వీధి ఆహార శైలితో అందిస్తున్నారు. జ్యుసి షవర్మ మాంసం, క్రీమీ వెల్లుల్లి మాయో, కరకరలాడే కూరగాయలతో నింపిన క్రిస్పీ గోల్ గప్ప షెల్స్ ను కలిపి తినడం ఒక అనుభూతిని అందిస్తుంది.